1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ | Stock market updates on 02 March 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌

Mar 2 2026 9:27 AM | Updated on Mar 2 2026 9:40 AM

Stock market updates on 02 March 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 97.8

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 77.3 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.98 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.43 శాతం నష్టపోయింది.

  • నాస్‌డాక్‌ 1.18 శాతం దిగజారింది.

ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్‌ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.

హుర్ముజ్‌ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్‌లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.

Today Nifty position 02-03-2026(time: 9:26 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement