
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను పొందాయి. సెన్సెక్స్ 7.25 పాయింట్లు లేదా 0.0090 శాతం నష్టంతో.. 80,710.76 వద్ద, నిఫ్టీ 6.70 పాయింట్లు లేదా 0.027 శాతం లాభంతో 24,741.00 వద్ద నిలిచాయి.
నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇండియా, జేఐటీఎఫ్ ఇన్‌ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, బరాక్ వల్లీ సిమెంట్స్, పీవీపీ వెంచర్స్, ఎస్ఏఎల్ స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, శ్రద్ధ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, ఎఫ్ఐఈఎమ్ ఇండస్ట్రీస్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)