దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు వీలు
తాజాగా నిబంధనలు సవరించిన సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్ విండో ఆటోమేటిక్ అండ్ జనరలైజ్‌డ్ యాక్సెస్ ఫర్ ట్రస్ట్‌డ్ ఫారిన్ ఇన్వెస్టర్స్(స్వాగత్–ఎఫ్‌ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది.
లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్‌ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్–ఎఫ్‌ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్‌లో ఆమోదముద్ర వేసింది.


