మీషో ఐపీవో @ రూ. 5,421 కోట్లు | Meesho, Vidya Wires, and Aequs are launching their IPOs next week | Sakshi
Sakshi News home page

మీషో ఐపీవో @ రూ. 5,421 కోట్లు

Dec 2 2025 6:35 AM | Updated on Dec 2 2025 6:35 AM

Meesho, Vidya Wires, and Aequs are launching their IPOs next week

రేపు ప్రారంభం 

లిస్టులో మరో రెండు సంస్థలు 

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం మీషో ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) రేపు (డిసెంబర్‌ 3న) ప్రారంభమై 5న ముగుస్తుంది. దీని ద్వారా కంపెనీ రూ. 5,421 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 105–111గా ఉంటుంది. దీని ప్రకారం మీషో వేల్యుయేషన్‌ గరిష్టంగా రూ. 50,096 కోట్లుగా ఉంటుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 4,250 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో రూ. 1,171 కోట్ల విలువ చేసే 10.55 కోట్ల షేర్లను విక్రయించనుంది. 

యాంకర్‌ ఇన్వెస్టర్లకు డిసెంబర్‌ 2 బిడ్డింగ్‌ తేదీగా ఉంటుంది. డిసెంబర్‌ 12న స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, బ్రాండ్‌ ప్రచారం, వేరే సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్‌ భాగస్వాములు, కంటెంట్‌ క్రియేటర్లను అనుసంధానించే ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంగా మీషో కార్యకలాపాలు సాగిస్తోంది.

 ప్రతి రోజు కొనుగోలుదారులకు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ ఎండీ విదిత్‌ ఆత్రే తెలిపారు. మీషో ఈ ఏడాది జూలైలో కాని్ఫడెన్షియల్‌ విధానంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా, ఐపీవోకి అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ. 5,577 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 4,311 కోట్లుగా నమోదైంది.  

రూ. 922 కోట్ల ఈక్వస్‌ ఇష్యూ
కన్జూమర్‌ డ్యూరబుల్‌ గూడ్స్, ఏరోస్పేస్‌ భాగాల కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ ఈక్వస్‌ ఐపీవో ద్వారా రూ. 922 కోట్లు సమీకరించనుంది. ఇది కూడా డిసెంబర్‌ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూ ప్రకారం ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 118–124గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 670 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్‌ కింద రూ. 252 కోట్ల విలువ చేసే 2.03 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. 

రెండు అనుబంధ సంస్థలైన ఏరోస్ట్రక్చర్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండియా, ఈక్వస్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ తీసుకున్న రుణాలను తీర్చివేసేందుకు, మెషినరీ కొనుగోలుకు, ఇతర సంస్థల కొనుగోళ్లకు ఐపీవో నిధులను కంపెనీ ఉపయోగించుకోనుంది. ఐపీవో కోసం జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసుకోగా సెపె్టంబర్‌లో అనుమతులు వచ్చాయి. ప్రధానంగా ఏరోస్పేస్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్వస్‌ ఇతరత్రా కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ మొదలైన విభాగాల్లోకి కూడా విస్తరించింది. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్‌ అయిన కాటమారన్, ఎమికస్‌ క్యాపిటల్‌ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్‌ చేశాయి. ఎయిర్‌బస్, బోయింగ్, హనీవెల్‌ హాస్‌బ్రో, వండర్‌òÙఫ్‌లాంటి సంస్థలు ఈక్వస్‌కి క్లయింట్లుగా ఉన్నాయి.  

పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఓయో
ట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫాం ఓయో మాతృ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల అనుమతిని పొందడం కోసం డిసెంబర్‌ 20న అసాధారణ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్లకు ఇచి్చన సమాచారం ప్రకారం అర్హులైన షేర్‌హోల్డర్లకు ప్రతి 19 ఈక్విటీ షేర్లకు గాను 1 ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేసే ప్రతిపాదనపై ఓటింగ్‌ ఉంటుంది. దీనికి డిసెంబర్‌ 5 రికార్డు తేదీగా ఉంటుంది. బోనస్‌ ఇష్యూ, ఐపీవో సంబంధిత తదుపరి నిధుల అవసరాలరీత్యా అ«దీకృత మూలధనాన్ని రూ. 2,431 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనపైనా షేర్‌హోల్డర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు.

అదే బాటలో విద్యా వైర్స్‌ .. 
వైండింగ్, కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్‌ తమ ఐపీవోకి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణిని రూ. 48–52గా నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ గరిష్ట విలువ రూ. 1,100 కోట్లుగా ఉంటుంది.  ఈ ఇష్యూ ద్వారా విద్యా వైర్స్‌ రూ. 300 కోట్లు సమీకరిస్తోంది. ఐపీవో డిసెంబర్‌ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ. 274 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా రూ. 26 కోట్ల విలువ చేసే 50.01 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు, రుణాల చెల్లింపునకు, కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. విద్యా వైర్స్‌ ప్రధానంగా పేపర్‌ ఇన్సులేటెడ్‌ కాపర్‌ కండక్టర్లు, స్పెషలైజ్డ్‌ వైండింగ్‌ వైర్లు, పేపర్‌ ఇన్సులేటెడ్‌ కాపర్‌ కండక్టర్స్‌ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. డిసెంబర్‌ 9న స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్టవుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement