Income Tax: అక్విజిషన్‌ డేటు V/S రిజిస్ట్రేషన్‌ డేటు | Tax Implications of Acquisition vs Registration Dates in Real Estate Deals | Sakshi
Sakshi News home page

Income Tax: అక్విజిషన్‌ డేటు V/S రిజిస్ట్రేషన్‌ డేటు

Dec 8 2025 8:38 AM | Updated on Dec 8 2025 9:11 AM

Tax Implications of Acquisition vs Registration Dates in Real Estate Deals

ఎన్నో స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో ఇదొక సమస్య. ఈ విషయంలో ఎన్నో వివాదాస్పదమైన చర్చలు, సంభాషణలు జరిగాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కంపల్సరీ. చట్టరీత్యా చెయ్యాలి. అలా చేసిన తర్వాతే కొనుక్కునే వారికి హక్కు ఏర్పడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్‌ డేటునే ప్రాతిపదికగా తీసుకుంటారు.

  •    రిజిస్ట్రేషన్‌ తేదీ నాడే హక్కు సంక్రమిస్తుంది.

  •    హోల్డింగ్‌ పీరియడ్‌.. అంటే ఆ సదరు ఆస్తి ఎన్నాళ్ల నుంచి ఆ వ్యక్తి వద్ద ఉంది అనేది. కొన్న తేదీ అలాగే అమ్మిన తేదీ .. ఈ రెండూ కూడా ఒప్పందం/అగ్రిమెంట్‌/డీడ్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ తేదీలే. ఈ మధ్య వ్యవధిని హోల్డింగ్‌ పీరియడ్‌ అంటారు. ఇక కొనుగోలు తేదీ నుంచి అమ్మకపు తేదీల మధ్య వ్యవధి .. దీన్ని నిర్ణయించడానికి రిజిస్ట్రేషన్‌ తేదీనే ప్రాతిపదికగా తీసుకుంటారు.

  •     ఈ హోల్డింగ్‌ పీరియడ్‌.. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో 2 సంవత్సరాలు దాటితే దీర్ఘకాలికం. రెండు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే స్వల్పకాలికం అంటారు.

  •     దీర్ఘకాలికం అయితే ఒక రకమైన పన్ను రేటు ఉంటుంది. (రెసిడెంటుకి 20 శాతం, నాన్‌ రెసిడెంటుకి 12.5 శాతం)

  •     స్వల్పకాలికం అయితే, ఇతర ఆదాయాలతో కలిసి శ్లాబుల ప్రకారం రేట్లు విధిస్తారు.

  •     హోల్డింగ్‌ పీరియడ్‌ కాకుండా కాస్ట్‌ ఆఫ్‌ ఇండెక్సింగ్‌ లెక్కించడానికి అక్విజిషన్‌ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు.

ఈ మేరకు ఎన్నో ట్రిబ్యునల్స్, కోర్టులు కూడా రూలింగ్‌ ఇచ్చాయి. వీటి సారాంశం ఏమిటంటే .. కొన్న వ్యక్తి మొత్తం ప్రతిఫలం చెల్లించి, ఆ ఆస్తిని తీసుకుని అనుభవిస్తున్నారు. అనుభవించడం అంటే తాను ఆ ఇంట్లో ఉండటం గానీ లేదా అద్దెకి ఇచ్చి.. ఆ అద్దెని ఇన్‌కం ట్యాక్స్‌ లెక్కల్లో చూపించినట్లయితే గానీ అని అర్థం. అయితే,  ఏదో ఒక కారణం వల్ల రిజిస్ట్రేషన్‌ జరగలేదు. రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో పడింది. అలాంటప్పుడు అలాట్‌మెంట్‌నే పరిగనలోకి తీసుకుంటారు.  

  •     సుప్రీం కోర్టు: సీఐటీ వర్సెస్‌ ఘన్‌శ్యామ్‌ 2009

  •     రాజస్తాన్‌ హైకోర్టు: సీఐటీ వర్సెస్‌ రుక్మిణీ దేవి 2010.

పైన చెప్పిన కేసుల్లో ఈ విషయాన్ని నిర్ధారించారు. వీటి సారాంశం ఏమిటంటే ఏ తేదీన అయితే స్వాధీనపర్చుకున్నారో, అంటే డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్, ఆ తేదీనే రిజి్రస్టేషన్‌ తేదీగా పరిగణిస్తారు. కాబట్టి డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్‌ ముఖ్యం.  

ఇక అలాట్‌మెంట్‌ డేట్‌ వేరు. ముఖ్యంగా సొసైటీల్లో, డెవలప్‌మెంట్‌ అథారిటీపరంగా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఫలితంగా అలాట్‌మెంట్‌ జరుగుతుంది.. అక్విజిషన్‌ కూడా జరుగుతుంది.. కానీ న్యాయపరమైన చిక్కులు, కోర్టు లిటిగేషన్స్‌ వల్ల చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్‌ సంవత్సరాల తరబడి వాయిదా అవుతుంది. బేరసారాలు జరిగి, అగ్రిమెంటు ప్రకారం ప్రతిఫలం ఇచ్చి అక్వైర్‌ (acquire) చేసుకున్నా, రిజి్రస్టేషన్‌ ప్రక్రియ ఆగిపోతుంది. పెండింగ్‌ పడిపోతుంది. ఇదొక సాంకేతిక సమస్య తప్ప న్యాయపరమైనది లేదా హక్కులపరమైన సమస్య కాదు.

అందుకని హోల్డింగ్‌ పీరియడ్‌కి, కాస్ట్‌ ఆఫ్‌ ఇండెక్సింగ్‌కి డేట్‌ ఆఫ్‌ అక్విజిషన్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు. క్రయవిక్రయాలు చేసే ముందు, లింక్‌ డాక్యుమెంట్లు, దస్తావేజులను క్షుణ్నంగా చదవాలి. అప్పుడే ముందడుగు వేయాలి. మరొక జాగ్రత్త. సేల్‌ డీడ్‌లో మార్కెట్‌ విలువను ప్రస్తావిస్తారు. ప్రతిఫలం కన్నా మార్కెట్‌ విలువ ఎక్కువ ఉంటే, మార్కెట్‌ విలువనే అమ్మకపు విలువగా తీసుకుంటారు. తగిన జాగ్రత్త వహించండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement