పెనుకొండ: ఊపిరితిత్తుల్లో ఖర్జూరం ఇరుక్కుని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని తోటగేరికి చెందిన గంగాధర్ గతంలో ఫ్లెక్సీలు వేస్తుండేవాడు. ప్రస్తుతం కార్లు అద్దెకు నడుపుతున్నాడు. ఆయన ఇటీవల గొంతు సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.
గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఊపిరాడలేదు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.


