సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.. విశాఖ జిల్లా కరక పాలమాంబ ఆలయ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న మద్ధి శ్రీనివాస్.. భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెద్ద వాల్తేర్‌లోని కాగితాల వీధిలోని ఓ ఇంట్లో యువతితో మద్ధి శ్రీనివాస్ ఉండగా.. ఆయన భార్య గదికి తాళం వేసింది.
గతంలోనూ టీడీపీ నేత మద్ధి శ్రీనివాస్ భార్య ఆందోళనకు దిగింది. మద్ధి శ్రీనివాస్‌పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పారు.



