
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.
ఇదీ చదవండి: మిలియనీర్‌గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!
2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు.