నాలుగోరోజూ రయ్‌.. | Stock market: Sensex rises 370 pts and Nifty settles at 24980 | Sakshi
Sakshi News home page

నాలుగోరోజూ రయ్‌..

Aug 20 2025 12:24 AM | Updated on Aug 20 2025 12:24 AM

Stock market: Sensex rises 370 pts and Nifty settles at 24980

సెన్సెక్స్‌ 371 పాయింట్లు ప్లస్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో జీఎస్‌టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్‌మార్క్‌ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్‌ (3%), టాటా మోటార్స్‌ (3.5%), ఎయిర్‌టెల్‌ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్‌ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. 

⇒  బ్లూస్టోన్‌ జ్యువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ షేరు లిస్టింగ్‌లో గట్టెక్కింది.  ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్‌ఈలో 1.58% డిస్కౌంట్‌తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.

⇒ ట్రంప్‌ టారిఫ్‌ విధింపుతో టెక్స్‌టైల్‌ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్‌ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్‌టైల్‌ షేర్లు వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌ 9%, రేమాండ్‌ లైఫ్‌స్టైల్‌ 8%, వెల్‌స్పన్‌ లివింగ్‌ 6%, అరవింద్‌ లిమిటెడ్, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 3% లాభపడ్డాయి.

⇒ డాలర్‌ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement