
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 746.29 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 80,604.08 వద్ద, నిఫ్టీ 198.85 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,562.15 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో సీఎల్ ఎడ్యుకేట్, యాత్ర ఆన్‌లైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎన్డీఎల్ వెంచర్స్, ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ వంటి కంపెనీలు చేరాగా.. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఫేజ్ త్రీ, ఆరోన్ ఇండస్ట్రీస్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, బెస్ట్ ఆగ్రోలైఫ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)