కర్నూలు పెద్దాసుపత్రి.. ఐదారు జిల్లాల రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ అరుదైన ఆపరేషన్లు చేస్తారు. దీంతో ఎంతో మంది పేదలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ వైద్య పరీక్షల నిమిత్తం రోగులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాల్సి రావడంతో ఒక రోగికి ఇద్దరు, ముగ్గురు సహాయకులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వార్డ్ బాయ్స్, ఆయాలు లేక పోవడంతో రోగుల సహాయకులే స్ట్రెచ్చర్, వీల్‌చైర్లను తోసుకుంటూ వెళ్లాల్సిందే. ఎక్స్‌రే, స్కానింగ్, రక్త పరీక్షలు తదితర చోట్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. రోగి వెంబడి వచ్చే సహాయకులు వార్డులో ఉండలేక ఆసుపత్రి ఆవరణలో చెట్ల నీడలో రాత్రింబవళ్లు సేద తీరుతూ కనిపిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
స్ట్రెచ్చర్, వీల్‌చైర్లను రోగుల సహాయకులే తీసుకెళ్తున్న దృశ్యం
చెట్ల కింద సేద తీరుతూ..
చంటి బిడ్డలతో అవస్థలు
ఒంటరి పోరాటం..
రోజూ.. ఇలాంటి దృశ్యాలు ఎన్నో..
అలసి ఎండలోనే నిద్రించిన వ్యక్తి
ఆసుపత్రిలో వీరి కష్టాలు కనేదెవరు..


