శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769.66 పాయింట్ల నష్టంతో 81,537.70 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్ల నష్టంతో 25,048.65 వద్ద నిలిచాయి.
ధంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


