అంబానీ ఫ్యామిలీతో కొరియన్‌ బిజినెస్‌మెన్‌.. గర్వంగా ఉందంటూ పోస్ట్‌ | Korean American Businessman Reacts to Meeting Mukesh Ambani Anant Radhika Merchant | Sakshi
Sakshi News home page

అంబానీ ఫ్యామిలీతో కొరియన్‌ బిజినెస్‌మెన్‌.. గర్వంగా ఉందంటూ పోస్ట్‌

Jan 24 2026 3:41 PM | Updated on Jan 24 2026 3:55 PM

Korean American Businessman Reacts to Meeting Mukesh Ambani Anant Radhika Merchant

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైనప్పటికీ.. చాలా వినమ్రంగా ఉంటారు. చాలా సందర్భాల్లో వ్యక్తులను గౌరవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కొరియన్ - అమెరికన్ వ్యాపారవేత్త 'వారెన్ చాంగ్' ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన తరువాత అనుభవాన్ని పంచుకున్నారు.

ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను వారెన్ చాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులు & కుటుంబం. నాకు చాలా గౌరవంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అంబానీ ఫ్యామిలీని ప్రశంసించారు.

ఎవరీ వారెన్ చాంగ్?
కొరియన్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన వారెన్ చాంగ్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈయన కంపెనీ నిర్వహించడంతో పాటు.. లెగో మినీఫిగర్‌లను (చిన్న బొమ్మలు) సేకరిస్తూ ఉంటారు. అంతే కాకుండా.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వంటి ప్రముఖులను, క్రీడా ప్రముఖులను, రాజకీయ నాయకులు & రాజకుటుంబ సభ్యులను కలిసిన చిత్రాలు చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement