
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్‌లు, బాండ్‌లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.
కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్‌షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్!
డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.
I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?
Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025