
న్యూఢిల్లీ: పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం సైతం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.1,100 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,21,000ను నమోదు చేసింది.
వెండి ధర కిలోకి రూ.1,50,500 వద్ద ఫ్లాట్‌గా ట్రేడయ్యింది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కావడం పసిడి ధరలపై ప్రభావం చూపించింది. అమెరికా లేబర్ మార్కెట్‌లో బలహీనత నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒక శాతానికి పైగా పెరిగి 3,895 డాలర్లకు చేరింది.