
గ్లోబల్ ఫైనాన్స్ ఎడ్యుకేటర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరో ముఖ్యమైన అంశంపై ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా “టాకింగ్ యువర్ బుక్” (talking your book) అనే ఆర్థిక పదాన్ని వివరించారు. దీని అర్థం తనకు లాభం వచ్చే ఆస్తులను ప్రచారం చేయడం, అది విద్య పేరుతో జరిగినా, వాస్తవంగా అమ్మకానికి దారితీస్తే అది నైతికంగా తప్పు అని ఆయన అభిప్రాయం.
“నేను నా రియల్ ఎస్టేట్ ద్వారా మిలియన్లు సంపాదించాను… కానీ నేను మీకు ఏ ఆస్తి లేదా మోర్టగేజ్ అమ్మడం లేదు. నేను బోధిస్తున్నాను, అమ్మడం కాదు,” అని కియోసాకి పేర్కొన్నారు. అలాగే, ఒక యూట్యూబ్ రియల్ ఎస్టేట్ కుటుంబం తమ ఆర్థిక సదస్సులో “ఒక ప్రత్యేక పెట్టుబడి అవకాశాన్ని” ప్రస్తావిస్తూ, “మీరు అర్హులైతే” అని చెప్పడం ద్వారా విద్యను అమ్మకానికి మలచడం జరిగిందని ఆయన విమర్శించారు.
బిట్‌కాయిన్, బంగారం, వెండి కొంటాను..
టాకింగ్ యువర్ బుక్ పాఠంపై పోస్టుకు కొనసాగింపుగా మరో చేసిన పోస్టులో, కియోసాకి తన పెట్టుబడి విధానాన్ని స్పష్టంగా చెప్పారు. “నేను బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తాను. అమ్మడం చాలా అరుదు” అంటూ రాసుకొచ్చారు. ఇది దీర్ఘకాలిక ఆస్తులపై ఆయన నమ్మకాన్ని సూచిస్తుంది. మార్కెట్‌ను ప్రభావితం చేయాలనే ఉద్దేశం లేకుండా, ఆయన తన ఆర్థిక నమ్మకాలను పంచుకుంటున్నారని ఇది సూచిస్తుంది.
VERY IMPORTANTANT $ LESSON;
Q: What does “talking your book” mean?
A: When a person is “talking their book” they have stopped teaching and are now selling.
For example: I often state I make millions from my real estate…using debt. When I state that I am teaching… not…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025