ఇన్వెస్టర్లకు బిగ్‌ న్యూస్‌ అంటున్న రిచ్‌డాడ్‌ కియోసాకి | Mutual funds ETFs for losers says Rich Dad Poor Dad Robert Kiyosaki why | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు బిగ్‌ న్యూస్‌ అంటున్న రిచ్‌డాడ్‌ కియోసాకి

Sep 17 2025 7:27 PM | Updated on Sep 17 2025 7:53 PM

Mutual funds ETFs for losers says Rich Dad Poor Dad Robert Kiyosaki why

ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి బిగ్‌ న్యూస్‌ అంటూ మరో సమాచారంతో ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ‘401(కె)’ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛనిస్తుందని, తనకు అనుకూలమైన బంగారం, వెండి, బిట్ కాయిన్‌ల విలువను మరింత పెంచుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

ట్రంప్‌ తాజాగా తీసుకొచ్చిన 401(కె) రైటర్‌మెంట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ అద్భుతమంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో రాబర్ట్‌ కియోసాకి ఓ పోస్ట్‌ పెట్టారు. తన స్నేహితుడు ఆండీ షెక్ట్మాన్ ప్రకారం.. ఆగస్టు 7న అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (401k)పై సంతకం చేశారని, అది ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడులపై మరింత స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు.

మ్యూచువల్ ఫండ్స్.. లూసర్లకు
‘మీలో చాలా మందికి తెలుసు కదా.. నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టను. నాకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు అనేవి నష్టపోయేవారి కోసం’ అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ కొత్త ఉత్తర్వు 401కె.. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, రుణాలు, క్రిప్టో , విలువైన లోహాలు వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులను ఒకే పన్ను గొడుగు కిందకు తెస్తుందన్నారు. ఇది తెలివైన, అధునిక ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తుందన్నారు.

కొత్త పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయలేనివారు, కష్టపడలేనివారు మాత్రం అవే సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ట్రంప్‌ కొత్త ఉత్తర్వుతో తాను మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఎందుకంటే ఇది తన బంగారం, వెండి, బిట్ కాయిన్ లను మరింత విలువైనదిగా చేస్తుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement