
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.
బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు.
"యూఎస్ డాలర్ అంతం?
"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.
యూఎస్ డాలర్‌ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.
విజేతగా ఉండండి.
జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
END of US Dollar?
Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.
Savers of US dollars are losers.
Be a winner.
Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025