
దేశీయ స్టాక్‌మార్కెట్లను వరుస నష్టాలు వీడాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 5.5 శాతం వద్ద ఉంచుతూ 'తటస్థ' వైఖరిని కొనసాగించడంతో భారత ఈక్విటీలు ఎనిమిది రోజుల నష్టాల పరంపరను విచ్ఛిన్నం చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 715.7 పాయింట్లు లేదా 0.9 శాతం పెరిగి 80,983.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.92 శాతం లేదా 225.2 పాయింట్లు పెరిగి 24,836.3 స్థాయిలకు చేరుకుంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.1 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.89 శాతం పెరిగాయి.
నిఫ్టీ బ్యాంక్, ఆటో, రియల్టీ రంగాలు వరుసగా 1.3 శాతం, 0.85 శాతం, 1.1 శాతం పెరిగాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.37 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 4 శాతం వరకు పెరిగాయి.
సెన్సెక్స్ లో టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ అధికంగా నష్టోయిన వాటిలో ఉన్నాయి.