
జాబితాలో హోటల్ పోలో, బాంబే కోటెడ్
ఏపీపీఎల్ కంటెయినర్స్, ధరీవాల్ బిల్డ్‌టెక్
ఆర్డీ ఇండస్ట్రీస్, కుసుమార్గ్, బాన్‌బ్లాక్ టెక్నాలజీస్..
కొద్ది రోజులుగా దుమ్మురేపుతున్న ప్రైమరీ మార్కెట్లు భవిష్యత్‌లో మరింత దూకుడు ప్రదర్శించనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్‌వర్క్ ఇండియా ఐపీవోలు వచ్చే వారం ప్రారంభం కానుండగా.. తాజాగా 7 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. ఇందుకు అనుగుణంగా సెబీకి దరఖాస్తు చేశాయి. వివరాలు చూద్దాం..
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఏడు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హోటల్ పోలో టవర్స్, బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్స్, ఏపీపీఎల్ కంటెయినర్స్, బాన్‌బ్లాక్ టెక్నాలజీస్, ధరీవాల్ బిల్డ్‌టెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, కుసుమార్గ్ చేరాయి. ఐపీవోలో భాగంగా స్టీల్ ప్రాసెసింగ్ సెంటర్లను నిర్వహించే బాంబే కోటెడ్ 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. స్టీల్ క్యాయిళ్ల ప్రాసెసింగ్‌లో ప్రత్యేకతను కలిగిన కంపెనీ ప్రస్తుతం 3,50,411 టన్నుల వార్షిక సామర్థ్యాన్ని అందుకుంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 1,056 కోట్లను తాకగా, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఆతిథ్య రంగ చైన్
ఐపీవోలో భాగంగా మధ్యస్థాయి ఆతిథ్య రంగ కంపెనీ హోటల్ పోలో టవర్స్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 71.2 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను విస్తరణ, ప్రస్తుత ప్రాపరీ్టల ఆధునీకరణ, రుణ చెల్లింపులు తదితర అవసరాలకు వెచి్చంచనుంది. కంపెనీ పోలో, మ్యాక్స్ బ్రాండ్లతో ప్రధానంగా దేశ ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో మధ్యస్థాయి హోటళ్లు, రిసార్టులను నిర్వహిస్తోంది. త్రిపుర, కోల్‌కతా, మేఘాలయ, షిల్లాంగ్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్ తదితర ప్రాంతాలలో 425 గదులతో హోటళ్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 118 కోట్లను తాకగా, రూ. 22 కోట్ల నికర లాభం ఆర్జించింది.
కంటెయినర్ల తయారీ
గుజరాత్‌లోని భావనగర్ కేంద్రంగా ఏర్పాటైన ఏపీపీఎల్ కంటెయినర్స్ ఐపీవోలో భాగంగా 12.5 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు మరో 25.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలతోపాటు.. రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2021లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా కంటెయినర్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 69 కోట్లను తాకగా, రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది.
సాస్ సొల్యూషన్స్
బ్లాక్‌చెయిన్, ఐవోటీ, డేటా సైన్స్ ఆధారంగా సాస్ సొల్యూషన్లు అందించే బాన్‌బ్లాక్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా రూ. 230 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 2020లో ఏర్పాటైన చెన్నై కంపెనీ ప్రమోటర్ బాన్‌బ్లాక్ ఇంక్ 3 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 136 కోట్లు ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్లాట్‌ఫామ్స్‌కు, రూ. 13 కోట్లు ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది. కంపెనీ ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సరీ్వసులు, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లలో వేగంగా విస్తరిస్తోంది.
రూ. 950 కోట్లకు రెడీ
ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ధరీవాల్ బిల్డ్‌టెక్ ఐపీవోలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 203 కోట్లు ఎక్విప్‌మెంట్ కొనుగోలుకి, రూ. 174 కోట్లు, రూ. 300 కోట్లు సంస్థతోపాటు అనుబంధ కంపెనీ రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు, సొరంగాలు తదితర నిర్మాణాలు చేపడుతోంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 1,153 కోట్లను తాకగా, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.
రికవరీ, రీసైక్లింగ్
ఇంధన స్టోరేజీ, నాన్‌ఫెర్రస్ స్కాప్ర్ నుంచి రికవరీ, రీసైక్లింగ్ చేపట్టే ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు మరో 3.76 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. లెడ్ అల్లాయ్స్, లెడ్ టిన్, లెడ్ సిల్వలర్ తదితర ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌లో తయారీ ప్లాంటు ఉంది.
రూ. 650 కోట్లపై కన్ను
ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్ తయారీ సంస్థ కుసుమార్గ్ ఐపీఓ ద్వారా రూ.650 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. 1990లో ఏర్పాటైన కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, పారిశ్రామిక, ఆటోమోటివ్ రంగాల కోసం ఫ్యాబ్రిక్స్ దస్తులు తయారు చేస్తుంది. కంపెనీకి గుజరాత్‌లో ఆరు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది. ఆర్థిక సంవత్సరం 2025 గానూ రూ.779 కోట్ల ఆదాయాన్ని, రూ.112 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.