
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 61.52 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 80,364.94 వద్ద, నిఫ్టీ 19.80 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో.. 24,634.90 వద్ద నిలిచాయి.
వాస్కాన్ ఇంజనీర్స్, వోకార్డ్, కొఠారి ప్రొడక్ట్స్, సైబర్‌టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కృష్ణ ఫోస్చెమ్, గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, వండర్లా హాలిడేస్, కెంప్లాస్ట్ సన్మార్, డీసీఎక్స్ సిస్టమ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)