
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం ఐదో రోజూ భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) ఇండెక్స్ 556 పాయింట్లు నష్టపోయి 81,160 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 24,891 వద్ద ముగిసింది.
పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ట్రెంట్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, టైటాన్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్ 3 శాతం వరకు నష్టపోయాయి.
నిఫ్టీ50 (Nifty) లో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్టాక్లకూ నష్టాలు తప్పలేదు.
విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.57 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ వరుసగా రెండో రోజు 1.65 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 0.9 శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగి లాభపడింది.