
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 466.26 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో.. 82,159.97 వద్ద, నిఫ్టీ 125.50 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో.. 25,201.55 వద్ద నిలిచాయి.
ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరెస్, కెరీర్ పాయింట్ ఎడ్యుటెక్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, డీఆర్సీ సిస్టమ్స్ ఇండియా, క్రిజాక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)