
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా నాల్గవ రోజు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ( Sensex) 386 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 81,716 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 (Nifty50) సూచీ 113 పాయింట్లు లేదా 0.45 శాతం పడిపోయి 25,057 వద్ద స్థిరపడ్డాయి.
టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), విప్రో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం షేర్లు 1 శాతం నుంచి 2.6 శాతం వరకు పడిపోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 2.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ (1.15 శాతం), నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ (0.8 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.18 శాతం పెరిగింది.
ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే..