
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం(సెప్టెంబర్ 24) జరిగింది.

సూపర్ సిక్స్ మోసాలు, రైతులు పడుతున్న అవస్థలు, పార్టీ శ్రేణులపై కూటమి సర్కార్ వేధింపులతో పలు అంశాలపై పార్టీ కేడర్‌కు ఆయన ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు.

అట్టర్‌ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్‌పై బలవంతపు విజయోత్సవాలా? అంటూ మండిపడ్డారు.

కార్యకర్తల కోసం వైఎస్సార్‌సీపీ డిజిటల్ బుక్‌ను ఆయన లాంచ్ చేశారు.

రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసిన వారి పేర్లు నమోదు చేసేలా ఏర్పాటు చేశారు.

















