
మంగళవారం ఉదయం గరిష్టంగా రూ. 1,260 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2,620లకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోయింది, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ కథనంలో తాజా గోల్డ్, సిల్వర్ ధరలను చూసేద్దాం..
👉హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,620 పెరిగి.. రూ.1,15,690 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ. 1,06,050 వద్దకు చేరింది.
👉ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు.. రూ.2,620 పెరిగి రూ.1,15,840 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ.1,06,200 వద్దకు చేరింది.
👉చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,300 పెరిగి రూ.1,16,080 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,06,400 వద్దకు చేరింది.
ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..
వెండి ధరలు
వెండి ధర రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1,50,000కు చేరింది. ఉదయం రూ. 1000 పెరిగిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు (మొత్తం రూ. 2000) పెరిగింది.