బాబోయ్ బంగారం.. రెండు రోజుల్లో రూ.4960 పెరిగిన రేటు | Today Gold And Silver Price April 11, 2025 | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: రూ. లక్షకు చేరువలో బంగారం: ఇక గోల్డ్ కొనడం కష్టమే?

Apr 11 2025 10:32 AM | Updated on Apr 12 2025 10:16 AM

Today Gold And Silver Price April 11, 2025

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం గరిష్టంగా రూ. 2940 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (ఏప్రిల్ 11) రూ. 2020 పెరిగి ఒక్కసారిగా షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,400 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 1850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2020 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,400 వద్ద ఉంది.

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,600 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,550 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 11) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,100 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఇదీ చదవండి: గూగుల్ డొమైన్ కొనేసిన ఇండియన్.. తర్వాత ఏం జరిగిందంటే?

Advertisement
 
Advertisement
Advertisement