
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 339 పాయింట్లు పెరిగి 24,941కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1037 ప్లాయింట్లు పుంజుకుని 81,635 వద్ద ట్రేడవుతోంది.

రానున్న దీపావళికల్లా జీఎస్‌టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్‌టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్‌టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)