
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ముగిసే సమయానికి లాభాలు కొంత తగ్గినప్పటికీ సోమవారం సానుకూలంగానే ముగిశాయి. ఇంట్రాడేలో 81,171.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం సెషన్లో 76.54 పాయింట్లు (0.09 శాతం) పెరిగి 80,787.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 32.15 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 24,773.15 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో సూచీ 24,885.50 నుంచి 24,751.55 మధ్య కదలాడింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.50 శాతం, 0.16 శాతం లాభాలతో ముగిశాయి. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మదర్సన్ సుమి, టాటా మోటార్స్ నేతృత్వంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 3.30 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ ఐటీ 0.94 శాతం నష్టపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్ టిఐ, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఎన్ఎస్ఈలో ట్రేడైన 3,144 షేర్లలో 1,749 షేర్లు లాభాల్లో ముగియగా, 1,285 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 110 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 114 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 50 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.07 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.