
దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దలాల్ స్ట్రీట్‌లో టపాసుల్లా పేలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు అర శాతానికి పైగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 661 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 84,614 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 191 పాయింట్లు లేదా 0.74 శాతం పెరిగి 25,901 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బాన్, బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే క్యూ 2 ఫలితాల తరువాత పెట్టుబడిదారులు స్టాక్ లో లాభాలను బుక్ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం స్టాక్స్ కూడా నష్టపోయాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం దాకా పెరిగాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)