
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పసిడి, వెండి ధరలు రాకెట్లలాగా దూసుకెళ్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే పసిడి దాదాపు 63 శాతం, వెండి అంతకు మించి 72 శాతం స్థాయిలో రాబడులిచ్చాయి. గత పదేళ్ల వ్యవధిలో రెండు దీపావళి పండుగల మధ్య మూడేళ్లు మినహా ఏడు సందర్భాల్లో ఈ రెండూ సానుకూల రాబడులనే ఇచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్‌లో కూడా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్‌ను కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి.
2026 దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో 4,500–5,000 డాలర్లకు చేరొచ్చని, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.1,40,000 – రూ.1,50,000 స్థాయికి చేరొచ్చని నిపుణులు తెలిపారు. అటు వెండి సైతం అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 60–70 డాలర్లకు, దేశీయంగా ఎంసీఎక్స్‌లో రూ. 1,80,000 – రూ. 2,00,000కు చేరొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశి్చతులు తగ్గితే తప్ప, సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి ర్యాలీ ఇకపైనా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి పోర్ట్‌ఫోలియోల్లో కనీసం 10 శాతం వాటాని పసిడి, వెండికి కేటాయించాలని పేర్కొన్నారు.