
వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది.

కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించిన వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
















