
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.
ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.
ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులు
ఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 27 - వినాయక చవితి
అక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరా
అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ
అక్టోబర్ 22 - బలిప్రతిపాద
నవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్
డిసెంబర్ 25 - క్రిస్మస్