
ప్రముఖ అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త, ఆర్థిక విద్యా మార్గదర్శకుడైన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఆయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ట్రంప్‌తో కలిసి రాసిన పుస్తకాల గురించి పేర్కొన్నారు.
ఐ లవ్ ట్రంప్.. అని మొదలు పెట్టి.. మేము ఇద్దరూ కలిసి రెండు పుస్తకాలు రాశాము. అందులో ఒకటి.. స్టాక్, బాండ్ మార్కెట్లను నియంత్రించే ధనిక పెట్టుబడి బ్యాంకర్లు 401-K(అమెరికాలోని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్) ద్వారా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారని చెబుతోంది.
బేబీ బూమర్లు (1946 నుంచి 1964 మధ్యకాలంలో జన్మించిన వారు) ఇబ్బందుల్లో పడుతున్నారని.. ద్రవ్యోల్బణం వారి 401-Kల కొనుగోలు శక్తిని తుడిచిపెట్టినప్పుడు, మిలియన్ల మంది బేబీ బూమర్లు నష్టపోయే అవకాశం ఉందని 'వారెన్ బఫెట్' కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్యానికి శాంతిని తీసుకురావడమే కాకుండా.. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోలతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటివే సాధారణ ప్రజలను ధనవంతులను చేస్తాయి.
ఇక రెండో పుస్తకం.. ఈఎస్‌బీఐ (ESBI: ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్) క్యాష్‌ఫ్లో క్వాడ్రాంట్ ఆర్ధిక సిద్ధాంతాన్ని వివరిస్తుంది. 401-K వైద్యులు, న్యాయవాదుల వంటివారి కోసం రూపొందించబడ్డాయి.
ఇదీ చదవండి: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
నాకు (రాబర్ట్ కియోసాకి), ట్రంప్, మస్క్ పెట్టుబడి పెట్టడానికి మరిన్ని, విభిన్నమైన & మెరుగైన ఆస్తులు ఉన్నాయి. మీరు కూడా ప్రత్యామ్నాయ (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ మొదలైనవి) పెట్టుబడులు పెట్టండి. భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.
మీ కోసం మీరే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. తెలివిగా మారడానికి, మీ భవిష్యత్తుకు ఉత్తమమైన ఆస్తులను ఎంచుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.
I LOVE TRUMP: We wrote two books together for many reasons. One of those reasons is because the rich investment bankers who control the stock and bond markets are screwing the working class via the workers 401-Ks.
Even Warren Buffet has been admitting Baby-boomers are…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 13, 2025