
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.
ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.
డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.
ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
పెరుగుతున్న వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.
REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year.
Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.
REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025