
బంగారంపై పెట్టుబడి పెట్టండి.. అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని చెప్పిన 'రాబర్ట్ కియోసాకి' మాటలు నిజవవుతున్నాయి. ఇప్పుడు ఎవరిదగ్గర బంగారం ఎక్కువ ఉందో వాళ్లే ధనవంతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు (అక్టోబర్ 9) 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,24,000 దాటేసింది. ఇలాంటి సమయంలో.. కియోసాకి వెండి గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
పసిడి ధరల మాదిరిగానే.. ''వెండి ధర దాదాపుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు మరింత పెరుగుతుంది. వెండి ధరలు భారీగా పెరగడానికి ముందే.. దయచేసి సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి'' అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
SILVER near time high.
Silver is a dollar away from turning into a rocket ship.
Please get a few silver coins before the silver rocket leaves the earth.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025
ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 1,71,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తుంటే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి బంగారంపైన మాత్రమే కాకుండా.. వెండిపై చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.
గతంలో చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్లానర్లు స్టాక్ కొనుగోలు చేయమని, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహాలు ఇచ్చారు. అయితే యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సురక్షితం కాదని కియోసాకి వాదన. అమెరికా ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశం అయినప్పుడు.. ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది. దివాలా తీసిన దేశం నుంచి బాండ్లను కొనుగోలు చేసేంత తెలివితక్కువవారు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
నిజం ఏమిటంటే.. కొన్ని సంవత్సరాలుగా బంగారం విలువ, స్టాక్‌లు.. బాండ్‌ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. నేను ఇప్పటికీ బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతాను. నిజమైన ఆస్తులు ఇవే. మీరు కూడా ఉత్తమైన వాటిలో పెట్టుబడి పెట్టండని కియోసాకి పేర్కొన్నారు.
FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.
FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.
That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.
For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025