
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.
అట్లాంటా, ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్‌టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)