
భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 304.32 పాయింట్లు లేదా 00.38 శాతం పెరిగి 80,539.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 131.95 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 24,619.35 వద్ద ముగిసింది.
బీఎస్ఈలో బీఈఎల్, ఎటర్నల్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్‌గా నిలవగా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
విస్తృత సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.63 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.66 శాతం లాభపడింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ హెల్త్‌కేర్ 2.13 శాతం, ఫార్మా 1.73 శాతం, మెటల్ 1.26 శాతం, ఆటో 1.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 0.04 శాతం, 0.14 శాతం, 0.05 శాతం నష్టపోయాయి.