
సోమవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 335.84 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 81,300.06 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో.. 24,859.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.
రెలియబుల్ డేటా సర్వీస్, ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, శ్రీ రామ మల్టీ టెక్, అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్, ఇండోవిండ్ ఎనర్జీ, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, శ్రీయోస్వాల్ సీడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)