
టారిఫ్ ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలను తోసిపుచ్చడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్లు (0.95 శాతం) క్షీణించి 79,857.79 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 232.85 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 24,363.30 వద్ద ముగిసింది.
ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్ 742 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, ట్రెంట్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
విస్తృత సూచీలు కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.64 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1.49 శాతం నష్టపోయింది. అన్ని రంగాలు నెగిటివ్ జోన్‌లో ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 2.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.76 శాతం, ఆటో 1.40 శాతం, ఫార్మా 1.30 శాతం నష్టపోయాయి.