
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్‌కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.
విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.
ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.
సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి.