
దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ ఫ్లాట్‌గా ముగిసింది. భారత స్టాక్ మార్కెట్లు ‘సంవత్ 2082’ను జాగ్రత్తగా ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప సానుకూలం వైపు స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 62.97 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 84,426.34 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.45 పాయింట్లు లేదా 0.1 శాతం పెరిగి 25,868.60 స్థాయిల వద్ద స్థిరపడింది.
విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.11 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.52 శాతం పెరిగాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో నిఫ్టీ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్, రియల్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్ప లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్.
ట్రేడింగ్ సెషన్ లో 2,213 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. 710 తగ్గుముఖం పట్టాయి. ఎన్ఎస్ఈలో 116 షేర్లలో మార్పులేదు. 106 స్టాక్స్ కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకగా, 36 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.
దీపావళి రోజున సాధారణ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సెలవు ఉంటుంది. కేవలం గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీన్ని సంప్రదాయంగా, ఒక శుభప్రదమైన కార్యక్రమంగా భావిస్తూ, నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం విక్రమ్ సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)