
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. వీక్లీ నిఫ్టీ 50 ఆప్షన్ల గడువు ముగియడంతో బెంచ్ మార్క్ సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11.95 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,631.30 వద్ద ముగిసింది.
మరోవైపు సెన్సెక్స్ 261 పాయింట్ల స్వల్ప రేంజ్‌లో కదలాడింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ 80,751.18 వద్ద గరిష్టాన్ని, 80,489.86 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 0.07 శాతం లేదా 57.75 పాయింట్లు పెరిగి 80,597.66 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.31 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.38 శాతం నష్టపోయింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (0.75 శాతం), నిఫ్టీ ఐటీ (0.4 శాతం) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మెటల్, రియల్టీ వరుసగా 1.39 శాతం, 0.76 శాతం నష్టపోయాయి.
కాగా ఈవారం ట్రేడింగ్ సెషన్ ఈరోజుతో ముగసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న శుక్రవారం భారత మార్కెట్లకు సెలవు ఉంటుంది. తదుపరి మార్కెట్ సెషన్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది.