
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.
ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్‌కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)