ఇన్ఫోసిస్‌ షేర్ల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్ | Stock Market September 9 Sensex ends 314 pts higher, Nifty at 24869 led by IT shares | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ షేర్ల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్

Sep 9 2025 3:48 PM | Updated on Sep 9 2025 4:07 PM

Stock Market September 9 Sensex ends 314 pts higher, Nifty at 24869 led by IT shares

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 11 న జరగనున్న బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ను పరిశీలిస్తామని ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ప్రకటించిన తరువాత బెంచ్ మార్క్ సూచీలు స్థిరమైన లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా సానుకూల ధోరణిని ప్రదర్శించింది. 314 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 81,101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 స్థాయికి చేరుకుంది.

సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్ గా ఉంది. ఒక్కో 5 శాతం పెరిగి రూ.1,504 లను తాకింది. ఈ స్టాక్ ఒక్కటే బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ కు 217 పాయింట్ల లాభానికి దోహదపడింది. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్ 1 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్ 1-2 శాతం నష్టపోయాయి.

విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం పెరిగాయి. రంగాలవారీగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.7 శాతం ఘన లాభంతో స్థిరపడటంతో కీలకమైన అవుట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ లో ఇండియా వోలాటిలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 1.8 శాతం క్షీణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement