
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్‌టైల్, నాగరీకా ఎక్స్‌పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్‌స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్‌ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)