
మెటల్, ఫార్మా షేర్ల లాభాల మద్దతుతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. పరోక్ష పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించడంపై చర్చించే రెండు రోజుల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా పుంజుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ 409.83 పాయింట్లు లేదా 0.51 శాతం లాభపడి 80,567.71 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 134.45 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 24,715.05 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈలో టాటా స్టీల్, టైటాన్, ఎంఅండ్ఎం షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, ఇన్ఫోసిస్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
విస్తృత సూచీలు కూడా లాభాలలోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.69 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.89 శాతం లాభపడింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 3.11 శాతం లాభపడగా, ఫార్మా 1.10 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.03 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.74 శాతం, మీడియా 0.04 శాతం చొప్పున నష్టపోయాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)