
శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270.92 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 79,809.65 వద్ద, నిఫ్టీ 74.05 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,426.85 వద్ద నిలిచాయి.
జిందాల్ ఫోటో, జిందాల్ పాలీ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, కృతికా వైర్స్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, ఎల్జీ రబ్బరు వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్టీల్‌కాస్ట్, జీఎస్ఎస్ ఇన్ఫోటెక్, పనామా పెట్రోకెమ్, బాలకృష్ణ పేపర్ మిల్స్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)