
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్‌తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలు
క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్‌ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్‌డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.
ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్‌ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.
ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో స్ట్రాటజిక్ పొజిషనింగ్‌లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.
ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం!