
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398.45 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో 82,172.10 వద్ద, నిఫ్టీ 135.65 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 25,181.80 వద్ద నిలిచాయి.
జిందాల్ ఫోటో లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎం బ్రూవరీస్, ఆల్కలీ మెటల్స్, వీ విన్ లిమిటెడ్ వంటివి లాభాల జాబితాలో చేరాయి. నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), మోడీ రబ్బర్ లిమిటెడ్, సుమీత్ ఇండస్ట్రీస్, హెడ్స్ అప్ వెంచర్స్ వంటి కంపెనీలు వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)